![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జోరందుకుంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా హరీష్ ని సుమన్ శెట్టి టీమ్ అయిన రాము నామినేషన్ చేస్తాడు. రాము చెప్పినారు రీజన్ ఏంటంటే. మొన్న సంజన గారు హౌస్ నుండి వెళ్ళిపోయి స్టేజ్ మీదకి వస్తారు. అక్కడ మీ గురించి ఏదో హైజినీక్ గా లేరని అన్నారు. అది ఆమె పర్సనల్ ఒపీనియన్ కానీ మీరు ఆ తర్వాత తనూజ గారు వచ్చి.. టీ చేసి ఇవ్వండి అంటే నేను చెయ్యను హైజీనిక్ గా లేనని అంటున్నారని రాము చెప్పాడు.
అలా మీరు అనడం కరెక్ట్ కాదు ఫుడ్ మానిటర్ గా ఓనర్స్ ఏం చెప్తే అది చెయ్యాలి మీ బాధ్యత అని రాము అంటాడు. నేను అన్నాను.. అలా సంజన అన్నప్పుడు ఎవరైనా నాకు సపోర్ట్ గా మాట్లాడారా.. ఇప్పుడు వచ్చి నంగనాచి తుంగ బుర్రలాగా వచ్చి మాట్లాడుతున్నారని హరీష్ అంటాడు. నేను వంట చేసినప్పుడు యమ్మీ అంటూ తిని అలా మాట్లాడతాడు.. ఇక రాము ఒక్కొక్క పాయింట్స్ చెప్తుంటే.. నువ్వు మెల్లిగా డ్యాన్స్ చెప్పు.. నువ్వు కామ పెడుతూ చెప్తావ్.. నేను అలాగ ఉండను.. చెప్తే ఫుల్ స్టాపే అని రాము గురించి హరీష్ వెటకారంగా మాట్లాడతాడు.
ఇక హరీష్ మాటలకి మధ్యలో తనూజ కలుగజేసుకుంటుంది ఇద్దరికి మాట మాట పెరిగి గొడవ అవుతుంది. గత మూడు వారాలుగా హరీష్ కి నాగార్జున క్లాస్ తీసుకుంటున్నాడు. కానీ అయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు.. తన మాటలకి అడ్డుఅదుపు లేకుండాపోయింది. ఈ వారం కూడా వీకెండ్ లో నాగార్జునతో చీవాట్లు తప్పేలా లేవు.
![]() |
![]() |